తాడేపల్లిగూడెం రూరల్: ప్రతీ చిన్నారి జీవితంలోనూ బారసాల ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో అంతే ప్రాముఖ్యత అక్షరాభ్యాసానికి ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలతో దేవాలయాల్లో ‘ఓనమాలు’ దిద్దించేందుకు ఆసక్తి చూపుతారు. అందులోనూ మేధా సరస్వతీ దేవి ఆలయం అంటే మరింత విశిష్టతను సంతరించుకుంటుంది. తెలంగాణలోని బాసర తర్వాత పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శైవక్షేత్రంలో అనేకమంది దేవతామూర్తులు నిలయమయ్యారు. ఈ ప్రాంగణంలోనే బాసర తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న మేధా సరస్వతీ అమ్మవారు కొలువై ఉన్నారు. సామూహిక అక్షరాభ్యాసాలకు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో ఇక్కడికి తరలివస్తుంటారు. ఆ తరుణం రానే వచ్చింది. అదే వసంత పంచమి. దీనిలో భాగంగానే ఈ నెల 30వ తేదిన పెద్ద సంఖ్యలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించేందుకు వీరంపాలెం శైవక్షేత్రం సిద్ధమవుతోంది.
అక్షర పండుగ.. వసంత పంచమి