హైదరాబాద్ : ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు బుధవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రబీలో సాగైన పంటలు, ప్రభుత్వ కొనుగోళ్ల పరిస్థితిపై సీఎంకు లేఖలో వివరించారు. రైతులను ఆదుకునే విషయంలో తమ విజ్ఞప్తులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్-19 గడ్డు కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాల మద్దతు ఇస్తామని తెలియజేశారు.
1. మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగించిన మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కరోనాను మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ లాక్‌డౌన్ పొడిగింపు వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా ఛిద్రమయ్యే ప్రమాదం ఉంది. అంతే కాకుండా అన్నదాత అయిన రైతన్న మరీ ప్రమాదంలో పడ్డాడు. రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరం ఉంది.